పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చితే... భారత సైన్యం నాలుగు తూటాలతో దీటుగా సమాధానమిస్తుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
జమ్ము: పాకిస్తాన్ ఒక్క తూటా పేల్చితే... భారత సైన్యం నాలుగు తూటాలతో దీటుగా సమాధానమిస్తుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 'మన బలగాలు చేసిన పనిని ప్రజలు కొనియాడుతున్నందున... నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను' అని అన్నారు. సరిహద్దు ప్రాంతాల పర్యటనలో భాగంగా కతువా జిల్లాలో సైన్యం పనితీరుని ఆయన ప్రశంసించారు. పాక్ బలగాలు సామాన్య ప్రజలపై కాల్పులకు పాల్పడుతోందని జితేంద్ర సింగ్ మండిపడ్డారు..
చాలా ఏళ్ల తర్వాత భారత సైన్యం దాయాది దేశం పాకిస్తాన్ దాడులకు దీటుగా బదులిచ్చిందని ప్రజలు చెబుతున్నారని.. జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల వలసదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆయన చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ ముగిస్తామని జితేంద్ర సింగ్ తెలిపారు.