ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 4 లక్షలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయని.. వాటిని త్వరలోనే భర్తీ చేయనున్నట్టు బుధవారం వెల్లడించింది. సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం.. కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలేయడంతో లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
''వార్షిక రిపోర్టు ప్రకారం...2016 మార్చి 1 వరకు కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి'' అని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్దకు రాలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment