
శాఖల కేటాయింపుపై మంత్రులతో చంద్రబాబు చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపు విషయమై మంత్రులతో చర్చిస్తున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపు విషయమై మంత్రులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉప ముఖ్య మంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్న రాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
మంత్రులలో ఎవరికి ఏఏ శాఖ కేటాయించేది ఈ సమావేశంలో ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నెల 12న విశాఖలో మంత్రి మండలి తొలి సమావేశం జరుగుతుంది. 19 నుంచి అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది.