సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. కోవిడ్-19కు నివారణగా నిక్లోసామైడ్ (టేప్‌వార్మ్ డ్రగ్) ఔషధాన్ని రియలన్స్ ముందుకు తీసుకు రానుంది. రిలయన్స్ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు - ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుండి అనుమతి లభించింది.
అంతేకాదు మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్ కిట్స్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు రిలయన్స్ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ ఆసుపత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తోంది. ఇందుకుగాను రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ "స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్" వినియోగిస్తోందని బ్లూం బర్గ్ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట.
కాగా కరోనాపై పోరులో భాగంగా 2020 లో రిలయన్స్ ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ఫం డ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను అందించింది. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ చురుకుగా సహాయం చేస్తోంది.
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి కరోనా బాధితులకు ఉచిత చికిత్స అందించేలా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 225 పడకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలో దేశంలోని మొత్తం మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రిలయన్స్ 11 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్‌లో 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ , జర్మనీ నుంచి 24 ఐఎస్‌వో కంటైనర్లను విమానంలో రప్పించిన సంగతి తెలిసిందే.
చదవండి : vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment