సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది.
మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.
క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్‌లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు.
ఎల్‌వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment