
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. సోషల్ నెట్ వర్క్‌లో కస్టమర్లు నిజమైన పేర్లను ఉంచేలా నియోగదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇండియాలో వినియోగదారులకు ఆధార్ కార్డు ప్రకారం పేర్లను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. చాలా పరిమితంగా ప్రస్తుతానికి దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది.
తాము పరీక్షిస్తున్న ఈ ఫీచర్ ఒక ఐచ్ఛిక ప్రాంప్ట్ అని , ఆధార్ కార్డుపై పేరును తప్పనిసరిగా నమోదు చేయవలసిన అవసరం లేదని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే తాజా చర్య ప్రకారం ఫేస్‌బుక్ లో కొత్తగా అకౌంట్ తెరిచే వారు ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కాకుండా ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరును పేర్కొనాలని సూచిస్తోంది. ఇది కూడా కొందరికి మాత్రమేనని, తప్పనిసరి కాదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. తద్వారా ఫేస్‌బుక్ యూజర్లు స్నేహితులు, బంధువులు మిమ్మల్ని గుర్తించడం సులభమవుతుందని అంటోంది.
కాగా పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ లింకింగ్‌కోసం కొంత గడువును కూడా ఇచ్చింది. అయితే ఆధార్ లింకింగ్ ప్రక్రియపై వివాదం, ఇటీవ సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధాన సమయం పొడిగింపు అంశాలు తెలిసిన సంగతే.
Comments
Please login to add a commentAdd a comment