ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. తన కాంపిటీటర్ టిక్ టాక్‌కు చెక్ పెట్టేలా కొత్త కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. ఇప్పటికే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోలు వీక్షించడంతో పాటు ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లు సైతం ఫేస్‌బుక్‌లో కన్వర్ట్ అయ్యేలా డిజైన్ చేసింది. అయితే తాజాగా ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
'ఫీడ్'అనే పేరుతో ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజర్లు కోరిన విధంగా మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్ 'ఫీడ్' ఫీచర్‌ను డెవలప్ చేశాం. ఈ ఫీచర్ సాయంతో ఫ్రెండ్స్, గ్రూప్స్, పేజెస్‌లో అప్‌డేట్ అయ్యే లేటెస్ట్ పోస్ట్‌లను వీక్షించవచ్చు. స్నేహితులు ఏం పోస్ట్ చేస‍్తున్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అది నెరవేరబోతుందని అన్నారు.
త్వరలో డెస్క్ టాప్
ప్రస్తుతం ఫీడ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్‌లలో వీక్షించ వచ్చని పేస్‌బుక్ తన పోస్ట్‌లో తెలిపింది. మరికొన్ని వారాల్లో డెస్క్ టాప్ వెర్షన్‌లో సైతం ఈ ఫీచర్ సాయంతో లేటెస్ట్ పోస్ట్‌లను చూడొచ్చని ఫేస్‌బుక్ పేర్కొంది.
యూజర్లకు మరింత ఆసక్తిగా
యూజర్లకు లేటెస్ట్ సోషల్ మీడియా కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో గత కొన్నేళ్లుగా అల్గారిథమ్‌ను అభివృద్ధి చేస్తుంది. తాజా ఎనేబుల్ చేసిన కొత్త ఫీచర్ సైతం అందులో భాగమేనని ఫేస్‌బుక్ తెలిపింది. తద్వారా యూజర్లు రీల్స్ క్రియేట్ చేయడం, వారి కనెక్షన్‌లు ఫీడ్‌లో ఎలాంటి పోస్ట్‌లు ఉన్నాయో చూడొచ్చు. కొత్త యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment