
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో కరోనా వైరస్ పరీక్షలకు అడ్డుకట్ట పడింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ప్రక్రియకు తాత్కాళికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాని కారణంగా నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది.
చదవండి : అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ