సాక్షి, న్యూఢిల్లీ : వచ్చేనెలలో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకానుంది. ఎన్‌ఐఏ బయోటెక్నాలజీ సెంటర్‌లో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అతి త్వరలోనే టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రస్తుతం దేశంలో కసౌలి, నోయిడాలో మాత్రమే టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పుణె, హైదరాబాద్‌లో కొత్తగా టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుతో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగవంతం అవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment