ఆరు లక్షల కోవిడ్‌-19 టెస్టులకు ఏర్పాట్లు | Govt Plans To Conduct 6 Lakh Covid Tests In Delhi | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : దేశ రాజధానిలో మూకుమ్మడి పరీక్షలు

Published Thu, Jun 18 2020 3:52 PM | Last Updated on Thu, Jun 18 2020 5:13 PM

Govt Plans To Conduct 6 Lakh Covid Tests In Delhi - Sakshi

ఢిల్లీలో విస్తృతంగా కరోనా పరీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో మహమ్మారి కట్టడికి పలు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ నగరంలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించిన క్రమంలో దేశ రాజధానిలో 6 లక్షల కోవిడ్‌-19 టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌ రెడ్డి వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే 169 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ మెథడాలజీ ద్వారా భారీఎత్తున టెస్ట్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు కోవిడ్‌-19 నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌ కోసం ధరను 2400 రూపాయలుగా నిర్ధారించినట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా వెల్లడించారు. మరోవైపు దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం మరోసారి ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించారు.

చదవండి : కోవిడ్‌-19 : అమిత్‌ షా కీలక భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement