పంచాయితీల్లో మూలనపడేసిన నీటి పరీకల కిట్
వాటర్ టెస్ట్ .. వరస్ట్
Published Sat, Aug 27 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
పల్లెవాసులకు అందని సురక్షిత నీరు
పంచాయతీల్లో మూలనపడిన టెస్టింగ్ కిట్‌లు
వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు
పట్టించుకోని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
సురక్షితమైన తాగునీరు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇదో సమాధానం లేని ప్రశ్న! అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం అందజేసిన నీటి నమూనా కిట్‌లు వృథాగా మారి.. పల్లెవాసులకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. తూప్రాన్ మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తూప్రాన్: పంచాయతీలకు 2012లో గత ప్రభుత్వం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో వాటర్ టెస్టింగ్ కిట్లు పంపిణీ చేసింది. పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్‌ఎంలు నీటి నాణ్యత పరీక్షలు సంయుక్తంగా నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పద్ధతి ఎక్కడా కొనసాగకపోవడం గమనార్హం. తూప్రాన్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు నీటి పరీక్షలు నిర్వహించకపోవడమే ఇందుకు ఉదాహరణ.
వ్యాధులు మంచుకొచ్చినప్పుడే..
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో లోపాలు ఉన్నారుు. భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు వ్యవసాయ బోరుబావుల నుంచి నీరు తెచ్చుకొని తాగుతున్నారు. అవి కలుషితం అవుతుండటంతో విషజ్వరాలబారిన పడుతున్నారు. అటువంటి సందర్భాల్లో మాత్రమే పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎ స్, వైద్యశాఖ యంత్రాంగాలు హడావుడి చ ర్యలు తీసుకుంటున్నారు. తప్పితే సమస్య శా శ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేద న్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. నీటి పరీక్ష కి ట్లను సమర్థంగా వినియోగించుకుంటే ఇలాం టి సమస్యలు రావంటున్నరు గ్రామస్తులు.
కిట్‌లు పడేశారు!
నీటి పరీక్షల తర్వాత స్వల్పంగా బ్యాక్టీరియా ఉన్నట్లరుుతే.. ఆ నీటిని కాచి చల్లార్చిన తర్వాత వినియోగించుకోవచ్చు. ఒకవేళ అధిక శాతంలో జలాలు కలుషితమైతే ఆ నీటిని వినియోగించకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శులు చర్యలు చేపట్టాలి. ఈ తతంగమంతా భారం అనుకున్నారో? ఏమో? పంచాయతీల్లో కిట్‌లను మూలన పడేశారు. దీంతో ఒక్కో కిట్‌కు రూ.1200 చొప్పున మండలంలో 22 పంచాయతీలు, జిల్లాలో 46 మండలాల్లో 1,077 గ్రామ పంచాయతీలకు అందించిన కిట్లు వృథాగా మారారుు. ఫలితంగా రూ.12.92 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది.
శిక్షణ ఇచ్చిన చర్యలు శూన్యం
ఎక్కడా కిట్లను వినియోగించిన దాఖలాలు లేవు. కిట్ల వినియోగంపై గతంలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగాన్‌వాడి వర్కర్లు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. కానీ ఉపయోగం మాత్రం శూన్యం. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ స్వాతిని ‘సాక్షి’ఫోన్‌లో వివరణ కోరగా.. ‘ఇటీవలే తూప్రాన్ మండల బాధ్యతలు స్వీకరించా, గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకుంటా’అని చెప్పారు.
మా ఊళ్ల పరీక్షలు చేయలే
మా ఊళ్ల చాలా మంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విషయం తెలిసినా నీటి పరీక్షలు చేయలే. గ్రామానికి సరఫరా చేసిన కిట్లు పంచాయతీలో పడేశారు. పెద్దసార్లు వెంటనే చర్యలు తీసుకోవాలి. - కృష్ణ, గుండ్రెడ్డిపల్లి
Advertisement
Advertisement