సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్మెంట్ నిరంతరాయంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామన్నారు. రోజుకు 17 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ డాక్టర్లను సేవలు అందించాలని కోరాం అన్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసుల్లో 19 శాతం మందికి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని వయసు పై బడిన వారు... దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు...గర్భిణిలుగా విభజించి వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా రోగుల్లో కేవలం ఐదు శాతం మందికే ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం 1100 సెంటర్స్ లో పరీక్షలు చేస్తున్నామన్నారు ఈటల రాజేందర్. (కోవిడ్ వారియర్స్ ఆహారంలో పురుగులు)
బస్తీల్లో వయసు పై బడిన వారి నుంచి స్వాబ్ కలెక్షన్ చేయడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఈటల. కంటైన్మెంట్ జోన్లలో వీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. పార్టీలు, సంస్థలు, ప్రజా సంఘాలు ... విధులు నిర్వహిస్తున్న వారికి ధైర్యం చెప్పాలని ఈటల కోరారు.
Comments
Please login to add a commentAdd a comment