‘దేశంలోనే తొలిసారి.. ఆక్సిజన్‌ కోసం యుద్ధ విమానాలు’ | Telangana Use Army Aircraft To Airlift Oxygen Says Etela Rajender | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కోసం 8 యుద్ధ విమానాలు: ఈటెల రాజేందర్‌

Published Fri, Apr 23 2021 1:30 PM | Last Updated on Fri, Apr 23 2021 4:05 PM

Telangana Use Army Aircraft To Airlift Oxygen Says Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆక్సిజన్‌ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను అనుమతిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రయంలో యుద్ధ విమానాలతో ఆక్సిజన్‌ సరాఫరా ప్రక్రియను మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయని తెలిపారు.

భువనేశ్వర్‌ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుందని వెల్లడించారు.. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్‌ నుంచి విమానాల్లో తీసుకెళ్తున్నారన్న మంత్రి.. సత్వరమే ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.

చదవండి: కరోనా: హమ్మయ్య.. నెగెటివ్‌.. అనుకునేలోపే! 




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement