సాక్షి, అమరావతి: దేశంలో పది లక్షల జనాభాకు 2 వేలకు పైగా కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు ఏపీలో 1,14,937 టెస్టులు నిర్వహించారు. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు 2,152 మందికి టెస్టులు చేస్తున్నట్టు తేలింది. ఎక్కువ టెస్టులు చేస్తున్న కారణంగా ఇన్ఫెక్షన్ ఉన్న వారిని వేగంగా గుర్తించి ఐసోలేషన్‌కు పంపగలుగుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఏపీలో ఇన్ఫెక్షన్ రేటు 1.38గా నమోదైంది. జాతీయ సగటు ఇన్ఫెక్షన్ రేటు 3.81గా ఉంది. కరోనా మరణాలు రేటు కూడా గణనీయంగా తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మరణాల రేటు 2.08గా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా 10,46,450 టెస్టులు నిర్వహించారు. ఈ గణాంకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 754 మందికి కరోనా నిర్థారిత టెస్టులు చేస్తున్నగా వెల్లడవుతోంది.
కాగా, ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 47 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఏపీలో 1,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,062 మంది చికిత్స పొందుతున్నారు. (ఏపీ: వీరు సచివాలయానికి రావాలి)
Comments
Please login to add a commentAdd a comment