India Test AD 1 Missile Can Intercept Target From 5000 KM Away - Sakshi
Sakshi News home page

మేరా భారత్‌ మహాన్‌: డీఆర్‌డీఏ వారి ఏడీ-1.. ప్రత్యర్థుల పాలిట విధ్వంస క్షిపణి

Published Thu, Nov 3 2022 7:24 PM | Last Updated on Thu, Nov 3 2022 7:48 PM

India Tests AD 1 Missile Can Intercept Target From 5000 Km Away - Sakshi

స్వదేశీ పరిజ్ఞానంతో.. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరబోతోంది. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను తునాతునకలు చేసేలా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(DRDO). ఈ మేరకు బుధవారం ఒడిశా తీరంలో జరిపిన రెండో దశ ప్రయోగం విజయవంతం అయినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. 

బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ షీల్డ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రెండు దశల అభివృద్ధి కార్యక్రమంగా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డీఆర్‌డీవో. గతంలో మొదటి దశ ప్రయోగంలో.. 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది ఈ మిస్సైల్‌. అయితే.. బుధవారం జరిగిన ప్రయోగంలో ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలిగిందని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ సమీర్‌ కామత్‌ వెల్లడించారు. 

మన రాడార్లు దానిని (శత్రువు క్షిపణిని) పసిగట్టగానే.. AD-1 దానిని ట్రాక్ చేస్తుంది. ఇది ప్రధానంగా ఎండో-వాతావరణానికి సంబంధించినది కానీ తక్కువ ఎక్సో-వాతావరణ ప్రాంతంలో కూడా పనిచేస్తుంది అని డీఆర్‌డీవో తెలిపింది. బాలిస్టిక్‌ క్షిపణులు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేసే సామర్థ్యం ఏడీ-1కి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాల లక్ష్యాలను ఈ మిస్సైల్‌ నాశనం చేస్తుంది. 2025 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని డీఆర్‌డీవో ప్రకటించింది.

ఇదీ చదవండి: ‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్‌గా అరెస్ట్‌ చేయండి’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement