మరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం | India test-fires indigenously developed nuclear-capable 'Agni-V' | Sakshi
Sakshi News home page

మరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం

Published Sun, Sep 15 2013 9:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

India test-fires indigenously developed nuclear-capable 'Agni-V'

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని రక్షణశాఖ మరోసారి ప్రయోగించింది. ఒడిశా కోస్తా తీరంలోని వీలర్‌ ద్వీపంలోని లాంచ్‌ ప్యాడ్‌-4 నుంచి డిఫెన్స్‌ రీసర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గ నైజేషన్‌ (డీఆర్‌డీఒ) దీన్ని పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం 8.50 గంటలకు దీన్ని ప్రయోగించారు.

ఉపరితలం నుంచి ఉపరితలం పైన ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-5 క్షిపణి ధ్వంసం చేయగలదు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. గతంలో 2012, ఏప్రిల్‌, 2న జరిగిన అగ్ని-5 క్షిపణి తొలి పరీక్ష విజయవంతమైంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement