యూఎస్‌ ‘క్షిపణి కూల్చివేత’ సక్సెస్‌ | US successfully 'intercepts and destroys' target in missile test | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ‘క్షిపణి కూల్చివేత’ సక్సెస్‌

Published Thu, Jun 1 2017 8:20 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

యూఎస్‌ ‘క్షిపణి కూల్చివేత’ సక్సెస్‌

యూఎస్‌ ‘క్షిపణి కూల్చివేత’ సక్సెస్‌

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని తొలి పరీక్షలోనే అమెరికా విజయవంతంగా కూల్చింది.

వాషింగ్టన్‌: ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని తొలి పరీక్షలోనే అమెరికా విజయవంతంగా కూల్చింది. ఉత్తర కొరియా నుంచి యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మాక్‌ పరీక్షను నిర్వహించింది. ఆధునీకరించిన మధ్యశ్రేణి ఇంటర్‌సెప్టార్‌ వార్‌హెడ్‌ సాయంతో ఈ ప్రయోగం చేపట్టింది. మార్షెల్‌ ద్వీపంలోని క్వాజాలీన్‌ ఎటోల్‌ నుంచి యూఎస్‌ సైన్యం మంగళవారం ఐసీబీఎం లాంటి ఆయుధాన్ని ప్రయోగించింది.

కాలిఫోర్నియాలోని వైమానిక దళ స్థావరం నుంచి మరో క్షిపణితో దీన్ని కూల్చివేసినట్లు పెంటగాన్‌ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి ప్రయోగానికి 244 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరిన్ని క్షిపణులను పరీక్షిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement