తెలుగులో హ్యపీ న్యూ ఇయర్ | SRK's 'Happy New Year' Trailer Released in Tamil, Telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో హ్యపీ న్యూ ఇయర్

Published Tue, Aug 19 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

తెలుగులో హ్యపీ న్యూ ఇయర్

తెలుగులో హ్యపీ న్యూ ఇయర్

ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. ఆ ఆశే రాను రాను నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకానికి కృషి తోడైతే అనుకున్నది సాధించగలుగుతాం... ఏంటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ‘మైహూనా’, ‘ఓం శాంతి ఓం’ తర్వాత షారుక్ ఖాన్ హీరోగా లేడీ డెరైక్టర్ ఫరా ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ‘ఓం శాంతి ఓం’తోనే దీపికా బాలీవుడ్‌కి పరిచయమైన విషయం తెలిసిందే. అందుకేనేమో  ఫరా, షారుక్ అంటే దీపికాకి ప్రత్యేకమైన అభిమానం.
 
 టైటిల్‌కి తగ్గట్టే ‘హ్యాపీ న్యూ ఇయర్’ మంచి జోష్‌గా ఉంటుందని, పండగలాంటి సినిమా అని షారుక్ తెలిపారు. అనుకున్నది సాధించేంతవరకూ ప్రయత్నిస్తూనే ఉండాలనీ, పడిన ప్రతిసారీ వేగంగా లేవాలని చెప్పే చిత్రమిదని ఫరా అన్నారు. ఇక, దీపికా అయితే తమ ముగ్గురి కాంబినేషన్లో మరో సంచలన విజయం ఖాయం అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండగలాంటి చిత్రాన్ని దీపావళి పండగకు విడుదల చేయాలనుకుంటున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement