ఖాన్ పర్యటనపై ఉత్సుకత | Happy New Year a quintessential Bollywood film, says Shah Rukh | Sakshi
Sakshi News home page

ఖాన్ పర్యటనపై ఉత్సుకత

Published Sun, Sep 14 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

ఖాన్ పర్యటనపై ఉత్సుకత

ఖాన్ పర్యటనపై ఉత్సుకత

వాషింగ్టన్: తన తాజా చిత్రం ‘హేపీ న్యూ ఇయర్’ ప్రచారం కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ చేపట్టనున్న అమెరికా పర్యటన భారతీయులతోపాటు అమెరికన్లు, దక్షిణాసియాకు చెందిన అభిమానుల్లో ఎనలేని ఉత్సుకత కలిగిస్తోంది. దశాబ్దకాలం తర్వాత ఈ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్ స్టార్’ అమెరికాలో పర్యటించనున్నా డు. అక్కడ లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నాడు.

ఈ పర్యటన కు శ్లామ్ (ఎస్‌ఎల్‌ఏఎం) అని ఖాన్ నామకరణం చేశాడు. ఎస్ అంటే సౌండ్, ఎల్ అంటే లైట్, ఏ అంటే యాక్షన్, ఎం అంటే మూవీ. ఖాన్ ప్రచార కార్యక్రమంలో దీపికా పదుకొణే, అభిషేక్ బచ్చన్, బొమన్ ఇరానీ, మాధురీదీక్షిత్, మలైకా అరోరా తదితరులు పాల్గొననున్నారు. ఖాన్ ప్రచార కార్యక్రమం విషయమై వాషింగ్టన్ డీసీ శివారులో నివసిస్తున్న అతని అభిమాని రిచర్డ్ వైట్ మాట్లాడుతూ ఇందుకోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నామన్నాడు.

నా స్నేహితుడు బలవంతం చేయడంతో ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా చూశా. అతడొక గొప్ప నటుడు’అని అన్నాడు. వర్జీనియాలో త్వరలో జరగనున్న ప్రదర్శనను తిలకించేందుకు రిచర్డ్‌తోపాటు అతని స్నేహితులు ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేశారు. ఖాన్ ప్రచార కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఖాన్‌తోపాటు ‘హేపీ న్యూ ఇయర్’ సినిమాలోని సహనటులంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. 19వ తేదీన హోస్టన్, 20న న్యూజెర్సీ, 26న చికాగో, 28న కాలిఫోర్నియాలో ప్రచార కార ్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 27వ తేదీన ఈ బృందం కెనాడాలోని వాంకోవర్ నగరం వెళ్లి అక్కడ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొననుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement