సొంతింటికొచ్చినట్టుంది | Happy New Year is homecoming for me: Deepika Padukone | Sakshi
Sakshi News home page

సొంతింటికొచ్చినట్టుంది

Published Tue, Oct 14 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

దీపికా పదుకొణే

దీపికా పదుకొణే

ఫరాఖాన్, షారుఖ్ ఖాన్ సంయుక్త ప్రాజెక్టు ‘ఓం శాంతి ఓం’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ... తిరిగి ఏడేళ్ల తర్వాత దీపావళి పండుగకు విడుదల కానున్న ‘హ్యేపీ న్యూఇయర్’ సినిమాతో సొంతించినట్టుగ ఉందంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత ్వం వహించగా షారుఖ్ ఖానే కథానాయకుడు. ‘హ్యేపీ న్యూఇయర్ సినిమాతో నాకు సొంతింటికి వచ్చినట్టనిపిస్తోంది. ఈ సినిమాతో ‘ఓం శాంతి ఓం’ జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయి. ఫరా.. నన్ను బేబీ అని పిలిచేది. నేను ఫరాను అమ్మా అని పిలిచేదాన్ని. ఫరా నాతో ఎంతో స్వేచ్ఛగా ఉండేది. వాస్తవానికి మాఇద్దరి సంబంధం అత్యంత ప్రత్యేకం. చాలాసేపు గడిపేవాళ్లం. కలిసి మాట్లాడుకునేవాళ్లం. సమయమే తెలిసేది కాదు.
 
 ఇక షారుఖ్, ఫరాలు కూడా కుటుంబసభ్యుల మాదిరిగా ఉండేవాళ్లు’ అని అంది. ఈ సినిమాకు ఫరాఖాన్ దర్శకత్వం వహించగా షారుఖ్‌తోపాటు అభిషేక్ బచ్చన్, సోనూసూద్, బొమన్ ఇరానీ, వియాన్‌షా తదితరులు నటించారు. ‘నిర్మాత/ కొరియోగ్రాఫర్, షారుఖ్‌ఖాన్‌ల చేతిలో నా కెరీర్ అత్యంత భద్రంగానే ఉందనిపిస్తోంది. ఇద్దరి వయసూ 49 సంవత్సరాలే. బాలీవుడ్‌లో అడుగుపెడుతూనే వారు నాకు మంచి అవకాశం కల్పించారు. నా బాధ్యతను వారు తమ నెత్తిపై పెట్టుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా పూర్తికాగానే ఫరాఖాన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చేయమని అడిగింది. నా డేట్స్ ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది’ అని ముగించింది ఈ 29 ఏళ్ల సుందరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement