ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఏడాదిని ఆస్వాదిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డితో కలిసి వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాతో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన చిత్రాలను తరచుగా పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు స్నేహారెడ్డి.
కాగా.. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం పుష్ప: ది రూల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక మందన్నా అతనికి మరోసారి జోడీగా కనిపించనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో పుష్ప-పార్ట్ 1 బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment