డబ్బులు లేక... డ్యాన్సులు చేశా! | Shah Rukh Khan second richest actor in the world | Sakshi
Sakshi News home page

డబ్బులు లేక... డ్యాన్సులు చేశా!

Published Tue, Apr 14 2015 10:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

డబ్బులు లేక... డ్యాన్సులు చేశా! - Sakshi

డబ్బులు లేక... డ్యాన్సులు చేశా!

షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్షానే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనిక సినీ ప్రముఖుల్లో ఒకరు కూడా. 2013 సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా తీస్తే టాప్ టెన్‌లో రెండో స్థానంలో షారుఖ్ నిలిచారు. ఈ విషయంపై షారుఖ్‌ను ఆకాశానికెత్తేసింది మీడియా. షారుఖ్ ఖాన్ మాత్రం తనదైన శైలిలో ఈ వార్త పై స్పందించారు. ‘‘డబ్బు విషయంలో కాదు.. అభిమానంలో నేను అత్యంత ధనికుణ్ణి. ప్రపంచవ్యాప్తంగా ప్రేమను పంచే అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదే నాకు సంపద’’ అని చెప్పారు. ‘‘‘హ్యాపీ న్యూ ఇయర్ ’ షూటింగ్ సమయంలో ఆ సినిమా నిర్మాతలు ఫోన్ చేసి మా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఏం చేద్దాం అని అడిగారు.

నేను వెంటనే పెళ్లిళ్లు, శుభకార్యాలకు నృత్యం చేసి డబ్బు సమకూరుస్తానని చెప్పా. అలానే డబ్బులు సంపాదించాను కూడా. దీంతో ఆ సినిమా చివరి షెడ్యూల్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాం. ఆ ఫోన్ మాట్లాడి పెట్టేసిన వెంటనే ట్విటర్‌లో ఓ వార్త చదివా.  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల్లో నాది రెండో స్థానం అని. ఆ సమయంలో నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు’’ అని షారుఖ్ ఖాన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement