ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం బతుకుతూ వర్తమానం ఎంజాయ్ చేయడాన్ని మర్చిపోతున్నారని దర్శకుడు పూరి జగన్నాధ్ అన్నారు. మనం ప్రజెంట్ సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యమన్నారు. ఇప్పటి ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరారు. అంతేకానీ రేపటి పేరు చెప్పి ఇప్పుడు ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హ్యాహీ నౌ హియర్ అంటూ వీడియో విడుదల చేశారు.
(ఇది చదవండి: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో..!)
పూరి మాట్లాడుతూ.. 'మనందరి కోరిక ఒకటే. హ్యాపీగా ఉండటం. దీని కోసం ముందు కష్టపడాలి. ఎందుకంటే అది మనకు తెలుసు. కానీ మనమేం చేస్తున్నాం. అలా కాకుండా హమ్మయ్య రేపటి నుంచి మన కష్టాలు తీరిపోతాయనుకుంటున్నాం. మనం నెక్ట్స్ ఇయర్ కుమ్మేద్దాం అనుకుంటాం. నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్. రేపటికి వాయిదా వేయడం ఎందుకు? నీకు దమ్ముంటే ఈ రోజు తాగకుండా ఉండగలవా? రాత్రంతా తాగడం మానేయ్. చక్కగా భోంచేసి పడుకో. కానీ అలా చేయవు. తాగి తందనాలు ఆడతావు. రేపటి ఆనందం కోసం ఈరోజు నాశనం చేస్తున్నాం. వర్తమానాన్ని మంటగలుపుతూ.. భవిష్యత్తు కోసం బతుకుతున్నాం.' అని అన్నారు.
'ఇప్పుడు నువ్వు ఆనందంగా లేకపోతే న్యూ ఇయర్ ఎప్పుడు బాగుండదు. ఆలాగే రేపటి కోసం బతుకుతున్నావంటే నీకు ఆనందం గురించి తెలియదు. నీ కష్టాలు తీరిపోయే రోజు ఎప్పుడు రాదు. ఈ రోజు డిసెంబర్ 31 ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారన్నది మనకు అనవసరం. వారితో కలిసి ఎంజాయ్ చేయ్ తప్ప.. రేపటి న్యూ ఇయర్ కోసం తాగకు. ఈ క్షణం నా లైఫ్ బాగుందనుకుని తాగు. దయచేసి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకోవద్దు. నేను మారిపోవాలి అనుకుంటే ఈ రోజే మారిపో. రేపు పేరు చెప్పి నాటకాలాడొద్దు. హ్యాపీనెస్ ఎప్పుడు ఫ్యూచర్‌లో ఉండదు.. ప్రజెంట్‌లోనే ఉంటుంది. హ్యూపీ నౌ హియర్.' అంటూ సందేశమిచ్చారు.
(ఇది చదవండి: ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి)
Comments
Please login to add a commentAdd a comment