
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఎన్నో కొత్త ఆశయాలతో, సరికొత్త ఆలోచనలతో, లక్ష్యాలను సాధించి ముందుకు పోవాలని ఆకాంక్షించారు. గతేడాదిలో విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో పెనుమార్పులు తెచ్చామన్నారు. కొత్త సంవత్సరం నుంచి రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలనీ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.