అనాహ్లాదకర చిత్రాలను తెరకెక్కించను!
న్యూఢిల్లీ: 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా వర్ణించిన దర్శకురాలు ఫరాఖాన్.. ఆ చిత్రం మరో కొత్త ట్రెండ్ ను సృష్టింస్తుందని అభిప్రాయపడ్డారు. తన సినిమాల్లో డ్యాన్స్ లు, పాటలు, మెలోడ్రామా, రొమాన్స్, ఎమోషన్స్, కలర్, స్టార్ పవర్ అన్ని కలగలసి ఉంటాయని తాజాగా ఐఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. తాను ఎప్పుడూ అనాహ్లాదకర చిత్రాలపై మక్కువ చూపనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఫిల్మ్ మేకింగ్ కు రాకముందు కొరియోగ్రఫీలో అనుభవం ఉన్నందున ప్రధానమైన పాటల్లో డ్యాన్స్ సీక్వెన్స్ ల్లో పాలుపంచుకుంటానని ఫరాఖాన్ తెలిపారు. అన్ని రకాల ప్రేక్షకులను వినోదాన్ని అందించడమే తన లక్ష్యమన్నారు.
కొన్ని సమయాల్లో కథ బాగున్నా.. భారతీయ ప్రేక్షకుల్ని ఆకర్షించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఫరాఖాన్ తెలిపారు. గతంలో తీస్ మార్ ఖాన్ ను తెరకెక్కించిన 49 ఏళ్ల ఫరాఖాన్ హ్యాపీ న్యూ ఇయర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాను ఎల్లప్పుడూ వినోద భరితమైన చిత్రాలపైనే దృష్టి పెడుతుంటానని.. అనాహ్లాదకర చిత్రాలను ఎప్పుడూ తెరకెక్కించనన్నారు.