సోను సూద్ అంటే షారుక్ కు ఈర్ష్య ఎందుకు?
ఇటీవల కాలంలో విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న సోను సూద్ చూసి బాలీవుడ్ ను ఏలుతున్న బాద్ షా షారుక్ కూడా ఈర్ష్య కలుగుతుందట.
సినిమా పరిశ్రమలో ఒకరిని చూసి మరొకరు ఈర్ష్య పడటం చాలా సహజమైందే. అయితే విలన్ పాత్రలు వేసుకునే ఓ నటుడ్ని చూసి ఓ సూపర్ స్టార్ ఈర్ష్య పడటం కొంత ఆసక్తి కలిగించే అంశమే. ఇటీవల కాలంలో విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న సోను సూద్ చూసి బాలీవుడ్ ను ఏలుతున్న బాద్ షా షారుక్ కూడా ఈర్ష్య కలుగుతుందట. ఈ విషయాన్ని ఓ పత్రిక కవర్ పేజి ఆవిష్కరణ సందర్భంగా సోను సూద్ స్వయంగా వెల్లడించారు.
నెగిటివ్ రోల్స్ చేస్తున్న నిన్ను చూస్తే నాకు ఈర్ష్గగా ఉంది. నిన్ను చూసిన తర్వాత నాకు కూడా పూర్తి స్థాయి విలన్ పాత్రలను పోషించాలనిపిస్తోంది అని షారుక్ తనతో అన్నారని సూద్ తెలిపారు. అయితే తనకు అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నాని సూద్ వెల్లడించారు. షారుక్ తో కలిసి సోను సూద్ ప్రస్తుతం హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దబాంగ్ చిత్రంలో చేడీ సింగ్ పాత్రలో ఆకట్టకున్న సోను సూద్, ఇటీవల ఆర్ రాజ్ కుమార్ చిత్రంలో పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన లభించింది.