ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్ | Sonu Sood, Jackie Chan my favourite men in the world | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్

Published Thu, Oct 1 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

ఈ  ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్

ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి హాలీవుడ్ హీరో జాకీ చాన్, విలక్షణ నటుడు సోనూసూద్ అంటే ప్రాణమట. ఈ ప్రపంచంలో  వాళ్లిద్దరూ తన ఫేవరట్స్ అని  చెబుతున్నాడు.  బాలీవుడ్లో రికార్డ్ కలెక్షన్స్ సినిమాలతో సత్తా చాటుతున్న ఈ హ్యాపీ న్యూ ఇయర్ హీరో వీళ్లిద్దరిపై తన అభిమానాన్ని సోషల్ మీడియాలో చాటుకున్నాడు. దీంతోపాటు హాలీవుడ్ మూవీ కుంగ్ ఫూ యోగాలో జాకీచాన్ తో  స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్న సోనూను ఒక కోరిక కూడా కోరాడు.

వీరిద్దరిపై తనకున్న మక్కువను ప్రకటించిన షారూఖ్ పనిలో పనిగా ట్విట్టర్లో  వీరిద్దరి ఫోటోను షేర్ చేశాడు.  అంతేకాదు ''సోనూ..  నేనూ జాకీని కలవాలి... ఆయన్ని చూడాలి. ఈ మాట ఆయనకు చెప్పవూ'' అంటూ  ట్వీట్ చేశాడు.  దీనికి  సోనూ సూద్  రీ ట్వీట్  కూడా చేశాడు. ''మీరన్నా నాకు అభిమానమే.. ఇప్పటికే చెప్పాను. జాకీతో  తప్పకుండా మాట్లాడిస్తా.. మిమ్మల్ని కలిసేలా చేస్తా... వెయిట్ చేయలేవా'' అంటూ కామెంట్ చేశాడు.  జాకీ చాన్ సినిమాలో నటించాలని వచ్చిన ఆఫర్ను  షారూక్ ఖాన్ తిరస్కరించినట్టు ఇటీవల  వార్తలు వచ్చిన నేపథ్యంలో షారూక్ ఖాన్ తాజా ట్వీట్ ఆసక్తిని రేపింది.


కాగా స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఫిలింగా రూపుదిద్దుకుంటున్న కుంగ్ ఫూ యోగా షూటింగ్ కార్యక్రమాలను  దుబాయ్,  బీజింగ్, ఇండియా లలో నిర్వహించనున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement