favourites
-
'ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది'
ముంబై : అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లకే ఎక్కువుగా ఉన్నాయని విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. అంతేగాక రానున్న ప్రపంచకప్ ఒక అద్బుతమైన ప్రపంచకప్‌గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. ' నా దృష్టిలో ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఘనంగానే ఆరంభిస్తుందనే ఆశిస్తున్నా. టీమిండియాకు కప్‌ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాకు సొంతగడ్డ కావడం ఆ జట్టుకు బలం చేకూర్చే విషయమే. అయితే ఎంత సొంత గడ్డైనా ప్రదర్శన బాగుంటేనే ఫలితం లభిస్తోంది. ఇక మా జట్టు విషయానికి వస్తే పరిమిత ఓవర్ల ఆటతీరు ఎలా ఉన్నా టీ20ల్లో మాత్రం దుమ్మురేపే ప్రదర్శననే నమోదు చేస్తోంది. అయితే జట్టుకు సుస్థిరత లేకపోవడం వల్ల ప్రపంచకప్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రానున్న ప్రపంచకప్‌లో రసవత్తరమైన పోరుకు మాత్రం కొదువ ఉండదు' అని లారా తెలిపాడు. కాగా విండీస్ పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచపకప్ టైటిల్ సాధించిన జట్టుగా నిలిచింది. భారత్ విషయానికి వస్తే 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలవగా, ఆసీస్ ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవకపోవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18న మొదలుకానుంది. (కోహ్లి, రోహిత్‌లు కాదు.. రాహులే గ్రేట్!) లారా ప్రసుత్తం రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రోడ్‌సేప్టీపై అవగాహన కల్పించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే బ్రియాన్ లారా వెస్టిండీస్ లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ముంబై క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లన్నింటిని రద్దు చేస్తున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా మ్యాచ్‌లన్నీ కొత్తగా రీషెడ్యూల్ చేసి డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) (ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్) -
ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి హాలీవుడ్ హీరో జాకీ చాన్, విలక్షణ నటుడు సోనూసూద్ అంటే ప్రాణమట. ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ తన ఫేవరట్స్ అని చెబుతున్నాడు. బాలీవుడ్లో రికార్డ్ కలెక్షన్స్ సినిమాలతో సత్తా చాటుతున్న ఈ హ్యాపీ న్యూ ఇయర్ హీరో వీళ్లిద్దరిపై తన అభిమానాన్ని సోషల్ మీడియాలో చాటుకున్నాడు. దీంతోపాటు హాలీవుడ్ మూవీ కుంగ్ ఫూ యోగాలో జాకీచాన్ తో స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్న సోనూను ఒక కోరిక కూడా కోరాడు. వీరిద్దరిపై తనకున్న మక్కువను ప్రకటించిన షారూఖ్ పనిలో పనిగా ట్విట్టర్లో వీరిద్దరి ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు ''సోనూ.. నేనూ జాకీని కలవాలి... ఆయన్ని చూడాలి. ఈ మాట ఆయనకు చెప్పవూ'' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్ రీ ట్వీట్ కూడా చేశాడు. ''మీరన్నా నాకు అభిమానమే.. ఇప్పటికే చెప్పాను. జాకీతో తప్పకుండా మాట్లాడిస్తా.. మిమ్మల్ని కలిసేలా చేస్తా... వెయిట్ చేయలేవా'' అంటూ కామెంట్ చేశాడు. జాకీ చాన్ సినిమాలో నటించాలని వచ్చిన ఆఫర్‌ను షారూక్ ఖాన్ తిరస్కరించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో షారూక్ ఖాన్ తాజా ట్వీట్ ఆసక్తిని రేపింది. కాగా స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఫిలింగా రూపుదిద్దుకుంటున్న కుంగ్ ఫూ యోగా షూటింగ్ కార్యక్రమాలను దుబాయ్, బీజింగ్, ఇండియా లలో నిర్వహించనున్నారు. Two of my absolutely favourite men in the world. Way to go Sonu and please tell Jackie I want to come and see him. pic.twitter.com/JI7juGL6EE — Shah Rukh Khan (@iamsrk) September 30, 2015 Love u the most Shahhhhh..already told him. Will make u speak to him tomorrow and force u to visit us! Can't wait! https://t.co/MSo7Tbf4sy — sonu sood (@SonuSood) September 30, 2015