
ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకున్నారు. ప్రజలంతా ఆనందం, ఉత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా 2016లో బలమైన పునాదులు పడ్డాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఒరవడిలో 2017 సంవత్సరం సాగేలా చూడాలని సీఎం కేసీఆర్ భగవంతుడిని వేడుకున్నారు.