సృజనకు ఏకాంతం అవసరం:షారూఖ్ ఖాన్
ముంబై: మనిలోని సృజనాత్మకతను వెలికి తీయాలంటే అది ఏకాంతంగా ఉన్నప్పుడే మాత్రమే సాధ్యమవుతుందని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే తనలోని క్రియేటివిటీని బాహ్య ప్రపంచలోకి తేవడానికి ఒంటరిగా గడపుతానని స్పష్టం చేశాడు. దీని గురించి కూడా ఎవరితోనూ చర్చలు చేయనని షారూఖ్ తెలిపాడు. కళ -వ్యాపారం అనే అంశంపై ఆదివారం ఓ ఇంటర్యూలో పాల్గొన్న షారూఖ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ' మనలో దాగి ఉన్న విషయాలను ప్రపంచానికి చూపించడానికి సృజన చాలా అవసరం. ఆ క్రమంలోనే తాను ఎప్పటికప్పుడూ అందుకోసం ప్రయత్నిస్తుంటాను' అని షారూఖ్ తెలిపాడు.
తన జీవితం తెరచి ఉంచిన పుస్తకం కానుందని బాద్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. నా గురించి కొంత భాగం మాత్రమే ప్రజలకు తెలుసు. ఇక నా జీవితం కూడా తెరచి ఉంచిన పుస్తకం అవుతుందన్నాడు. త్వరలో షారూఖ్ నటుడిగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం విడుదలకు సన్నహాలు చేస్తున్నారు.