తాను నటించిన ఏ సినిమా అయినా చివరకు భారీ సినిమాగా మారిపోతోందని సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. రొమాంటిక్ హీరోగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఖాన్ నటించిన కొన్ని సందేశాత్మక సినిమాలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. తాను కొంత రిస్క్ చేసి నటించిన సినిమాలు సైతం ప్రేక్షకులను అలరించడం తనకు ఆనందాన్నిచ్చిందని ఖాన్‌తెలిపాడు. ‘నేను ఒక సందేశాత్మక చిత్రంలో నటించినా అది చివరకు మంచి మార్కెట్‌ను సాధించింది. ‘నేను ‘మాయా మేమ్‌సాబ్’,‘ఓ డార్లింగ్ యే హై ఇండియా’, ‘డర్’, ‘బాజీగర్’, ‘స్వదేశ్’, ‘చక్ దే ఇండియా’ వంటి కొన్ని సినిమాలు చేసినప్పుడు అవి ఆఫ్- బీట్ సినిమాలు అనుకొన్నా.. కాని అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి వసూళ్లు కూడా సాధించాయి..’అని చెప్పాడు.
‘ఎవరో ఏదో చెప్పారనో.. అడిగారనో మొహమాటానికి నేను ఏ సినిమా చేయను.. నా మనసుకు నచ్చిన సినివ
ూలే చేస్తున్నా. ప్రస్తుతం నా దగ్గర కావాల్సినంత డబ్బుంది.. నేను చాలా పెద్ద స్టార్‌నిు. పేరు ప్రతిష్టలున్నాయి.. చాలా అవార్డులు గెలుచుకోగలిగాను. ఇప్పుడు నేను నా మనసుకు నచ్చిన, నా పిల్లలు మెచ్చిన సినిమాలు చేస్తా.. రా.వన్ సినిమా నా పిల్లల కోసం చేశా. నా తండ్రి హాకీ ఆటగాడు. అందుకే హాకీ నేపథ్యంలో చక్‌దే ఇండియాలో నటించా. ఇలా మనం నటిస్తున్న పాత్రపై మమకారం ఉండాలనేది నా సిద్ధాంతం..’ అని షారూఖ్ వ్యాఖ్యానించాడు.
తాను నటించిన ఆఫ్-బీట్ సినిమాలు ‘ఫ్యాన్’, ‘రాయీస్’ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయని ఖాన్ వివరించాడు. తన రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నడూ వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదన్నాడు. అలాగే నటుడిగా ఉన్నందుకు ఎన్నడూ బాధపడాల్సిన ఘటనలు ఎదురుపడలేదని చెప్పాడు. ఖాన్ హీరోగా నిర్మితమైన మల్టీస్టారర్ సినిమా ‘హ్యాపీ న్యూ ఇయర్’ వచ్చే దీపావళికి ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది. ఈ సినిమాకు డెరైక్టర్ ఫరా ఖాన్. ఆమె ఇంతకు ముందు షారూఖ్‌తో తీసిన ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
నేను చేసిన ప్రతిదీ పెద్ద సినిమాయే
Published Sun, Sep 28 2014 9:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement
Advertisement