71 ఏళ్ల వయసులో వీడియో గేమ్లు ఆడుతున్న అమితాబ్ | Big B enjoys video game with Abhishek bachchan, Shah rukh khan | Sakshi
Sakshi News home page

71 ఏళ్ల వయసులో వీడియో గేమ్లు ఆడుతున్న అమితాబ్

Published Fri, Nov 29 2013 5:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

71 ఏళ్ల వయసులో వీడియో గేమ్లు ఆడుతున్న అమితాబ్

71 ఏళ్ల వయసులో వీడియో గేమ్లు ఆడుతున్న అమితాబ్

ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం 17 ఏళ్లే!! అవును.. మనం మాట్లాడుకునేది ఎవరి గురించో కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించే.

ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం 17 ఏళ్లే!! అవును.. మనం మాట్లాడుకునేది ఎవరి గురించో కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించే. ఆయన తన కొడుకు అభిషేక్ బచ్చన్, సూపర్ స్టార్ షారుక్ ఖాన్తో కలిసి షూటింగ్ సమయంలో వీడియో గేమ్లు ఆడుతున్నారు.

మెహబూబ్ స్టూడియోలో 'హేపీ న్యూ ఇయర్' చిత్రం షూటింగ్ జరుగుతుండగా, అక్కడున్న అభిషేక్ను పికప్ చేసుకోడానికి అమితాబ్ వెళ్లారు. అక్కడ అభిషేక్, షారుక్ సహా దాదాపు నటులందరూ కూడా ప్లే స్టేషన్4లో సీరియస్గా ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు. వాళ్లకు అసలు షూటింగ్ అంటే ఏమాత్రం పట్టడంలేదని, హాయిగా షారుక్ ఖాన్ వ్యానిటీ వ్యాన్లో దూరిపోయి, పీఎస్4లో ఫుట్బాల్ ఆడుతున్నారని, కానీ తాను వాళ్లను పిలిచేందుకు లోపలికి వెళ్లాక.. తాను కూడా అందులో మునిగిపోయానని అమితాబ్ తన బ్లాగ్లో రాశారు. అమితాబ్ కూడా అంతర్జాతీయ సాకర్ మ్యాచ్లను పిచ్చిపిచ్చిగా చూస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement