కొడుకు ఫొటో ట్వీట్ చేసిన బాద్షా | Shah Rukh Khan tweets first picture of son AbRam | Sakshi
Sakshi News home page

కొడుకు ఫొటో ట్వీట్ చేసిన బాద్షా

Published Tue, Oct 7 2014 11:43 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కొడుకు ఫొటో ట్వీట్ చేసిన బాద్షా - Sakshi

కొడుకు ఫొటో ట్వీట్ చేసిన బాద్షా

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కొడుకు అబ్రం ఫొటోను ఎట్టకేలకు ప్రజలకు చూపించాడు. ట్విటర్ ద్వారా అందరికీ ఆ ఫొటోను షేర్ చేశాడు. ఈద్ ముబారక్ అంటూ.. పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోలో 48 ఏళ్ల షారుక్ ఖాన్ తన కొడుకును ఎత్తుకుని ముద్దాడుతున్నట్లు ఈ ఫొటోలో ఉంది. అందులో సారుక్ నల్ల టీషర్టు వేసుకుంటే పిల్లాడు మాత్రం తెల్ల దుస్తులు వేసుకుని తన బొమ్మల వైపు దూకుతుంటాడు. 'అందరికీ ఈద్ అల్ అదా ముబారక్. జీవితంలో అందరికీ సంతోషం కలుగు గాక. ఈ చిన్న పిల్లాడు కూడా మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాడు' అని తన ట్విటర్, ఫేస్బుక్ పేజీలలో షారుక్ పోస్ట్ చేశాడు.

గత సంవత్సరం మే నెలలో సరొగసీ పద్ధతి ద్వారా షారుక్, గౌరీ దంపతులు అబ్రాంను తమ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఇంతకుముందు వాళ్లకు ఆర్యన్ (17) అనే కొడుకు, సుహానా (14) అనే కూతురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement