అలా ఎందుకు ఫిక్స్ అవుతారో అర్థం కావడం లేదు - దీపికా పదుకొనే
అలా ఎందుకు ఫిక్స్ అవుతారో అర్థం కావడం లేదు - దీపికా పదుకొనే
Published Wed, Aug 7 2013 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘ఎందుకు జనం అంత తొందరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారో నాకు అర్ధం కావడం లేదు’’ అంటున్నారు బాలీవుడ్ భామ దీపికా పదుకొనె. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో తమిళ భాషను కించపరిచేలా సన్నివేశాలున్నాయని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దీపిక పై విధంగా స్పందించారు. ‘‘మన సంస్కృతిని మనం ఎందుకు కించపరుచుకుంటాం.
నేను, దర్శకుడు రోహిత్ శెట్టి దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్లమే. అంతెందుకు...‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్ తప్ప మిగతా నటులంతా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారే’’ అని స్పష్టం చేశారు దీపిక. గతంలో పంజాబ్ ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందాయి.
ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమపైనే ఆధారపడి బాలీవుడ్ చిత్రాలు రూపొందుతోన్న తరుణంలో దక్షిణాదికి చెందిన తాము దక్షిణాది భాషను కించపరుస్తామని ఎలా భావిస్తారన్నారు? అని దీపిక ప్రశ్నించారు. తమిళ భాషను హాస్యం కోసమే వాడుకున్నామని, ఆ భాషను అపహాస్యం చేసే విధంగా ఎక్కడ ప్రయత్నించలేదని దీపిక తెలిపారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఉత్తర భారతీయుడ్ని ప్రేమించిన తమిళ అమ్మాయిగా నటిస్తున్నానని ఈ సందర్భంగా దీపిక పదుకొనె చెప్పారు.
Advertisement