దీపికా పదుకోనేకు ఆరు.. కత్రినా కైఫ్ కు నాలుగు!
దీపికా పదుకోనేకు ఆరు.. కత్రినా కైఫ్ కు నాలుగు!
Published Wed, Sep 11 2013 1:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకోనే హవా బ్రహ్మండంగా కొనసాగుతోదని చెప్పడానికి తాజా సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దీపికా నటించిన 'కాక్ టెయిల్', 'యే జవానీ హై దివానీ', 'చెన్నై ఎక్స్ ప్రెస్' లాంటి భారీ హిట్లతో బాలీవుడ్ లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. తాజాగా దీపికా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' అన్ని రికార్డులను తుడిచిపెట్టి రికార్టులను బ్రేక్ చేస్తోంది. 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం దీపికా పదుకోనేకు మంచి పేరు తెచ్చి పెట్టడంతోపాటు యాడ్ రంగంలో కూడా కత్రీనా కైఫ్ ను సైతం వెనక్కి నెట్టేందుకు దోహదపడింది.
ఇక వరస హిట్లతో జోరుమీదున్న దీపికాకు అడ్వర్టైజింగ్ రంగంలో కూడా అఫర్లు భారీగానే వస్తున్నాయట. దీపికా తన స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకుని ఓ బ్యూటి సోప్ కంపెనీ 6 కోట్ల రూపాయలు ముట్టచెప్పిందట. అయితే ఇటీవల కత్రినా కైఫ్ కు 4 కోట్లకే సోప్ కంపెనీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే రాంఝ్నా చిత్రంతో హిట్ సాధించిన సోనమ్ కపూర్ తో రెండు కోట్ల రూపాయలతో అదే సోప్ కంపెనీ యాడ్ ను షూటింగ్ చేసింది. అదే మరి హిట్లకు, ఫ్లాప్ లకు ఉన్నా తేడా.. అంటున్నారు బాలీవుడ్ పరిశ్రమ పెద్దలు.
Advertisement
Advertisement