‘బక్వాస్ హిట్’పై షారుక్ ఆశ్చర్యం!
‘బక్వాస్ హిట్’పై షారుక్ ఆశ్చర్యం!
Published Thu, Aug 22 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
తాను నటించిన చిత్రం వందకోట్ల మార్కును అతితక్కువకాలంలో అధిగమించిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న హీరో పరిస్థితి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇదంతా షారుక్‌ఖాన్ గురించే.
తాజాగా విడుదలైన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వందకోట్ల మార్కును దాటేసి... 181 కోట్ల రూపాయల వసూళ్ల సునామీని కురిపించడంతో షారుక్‌ఖాన్‌కే చాలా ఆశ్చర్యమేస్తుందంట! ఆగస్టు 15 నాటికే విదేశాల్లో 53 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు బాక్సాఫీస్ సమాచారం. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కలెక్షన్ల రికార్డులను జెట్ స్పీడ్‌తో తుడిచిపెట్టుకుపోతుంటే, షారుక్‌కి ఏమి అర్ధం కావడం లేదట.
ఇదిలా ఉండగా షారుక్, దీపికా పదుకొనేలు నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంపై బక్వాస్ (చెత్త) హిట్ అంటూ పాల ఉత్తత్పుల సంస్థ అముల్ వ్యంగ్యంగా కార్టూన్ వేసింది. ఇటీవల కాలంలో ‘యే జవానీ హై దీవానీ’ సక్సెస్ కావడంతో ‘బత్తమీజ్ దిల్’ అంటూ అముల్ దీపికా పదుకునే చిత్రంతో అడ్వర్టైజింగ్ వేసింది. అతి తక్కువ కాలంలో ఓ యాక్టర్ బొమ్మను రెండు సార్లు విని యోగించుకోవడం అమూల్ చరిత్రలో ఇదే ప్రథమం.
Advertisement
Advertisement