కత్రినా ‘బికినీ’ వ్యవహారంపై దీపికా స్పందన!
కత్రినా ‘బికినీ’ వ్యవహారంపై దీపికా స్పందన!
Published Wed, Aug 7 2013 9:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్‌లో ప్రైవేట్ విహారయాత్ర చేసిన సందర్భంగా బికినీ దుస్తుల్లో బాలీవుడ్ తార కత్రినాకైఫ్ కెమెరాకు చిక్కిన ఫోటోలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ మీడియాకు లేఖ రాసి వివరణ ఇచ్చుకోవడంతో ఆ దుమారం సద్దుమణిగింది.
అయితే కత్రినా వ్యవహారంపై దీపికా పదుకొనే స్పందిస్తూ ‘నేను ఇప్పటి వరకు అలా ఎవరికంటా పడలేదు’ అని తెలిపింది. సెలబ్రీటిలకు, సమాజంలో ప్రముఖ వ్యక్తులకు అలాంటి సంఘటనలు ఎదురవ్వడం సహజమే అని ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో అఫైర్ నడుపుతున్న దీపికా అన్నారు. అందుకు మరొకరిని నిందించడం, ఆరోపణలు చేయడంలో ప్రయోజనం శూన్యం వెల్లడించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే.. కాస్తా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాను అని చెప్పింది.
చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుక్‌తో, యే జవానీ హై దివానీ చిత్రం తర్వాత రణబీర్ కపూర్‌తో జోడి క డుతున్నారని వచ్చిన వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు జవాబు దాటవేస్తూ.. ప్రతి చిత్రానికి ఓ గమ్యం ఉంటుందని.. తాను చిత్రాలను ఎంపిక చేసుకోను. సినిమాలోని పాత్రలే తనను వెదుకుంటూ వస్తాయని.. నటించడం అలా అలా జరిగిపోతుంటాయని దీపికా వేదాంతం ఒలకబోసింది. షారుఖ్ తో హ్యప్పీ న్యూ ఇయర్ అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు బాలీవుడ్ సమాచారం.
Advertisement
Advertisement