Yeh Jawaani Hai Deewani
-
అఖిల్ రెండో సినిమా రీమేకేనా?
చిన్నప్పుడు ‘సిసింద్రీ’లో ముద్దు ముద్దుగా కనిపించి, ఆకట్టుకున్న అఖిల్ పెద్దయ్యాక ‘మనం’లో కొన్ని క్షణాలు కనిపించి, కుర్రాడు కత్తి అనిపించుకున్నాడు. ఇక ‘అఖిల్’ చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో హీరోగా జనం ముందుకొచ్చాడు. ఆ సినిమా జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపితమైంది. ఇప్పుడు అక్కినేని అభిమానుల దృష్టంతా అఖిల్ చేయనున్న రెండో చిత్రం పైనే. ‘ఊపిరి’ చేస్తున్నప్పుడు ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి పని తీరు నచ్చి, అఖిల్ రెండో సినిమాకి అతనే దర్శకుడని నాగార్జున అనుకున్నారనే వార్త వచ్చింది. దానికి తగ్గట్లే అఖిల్ కోసం వంశీ స్టోరీ వర్కవుట్ చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఇప్పుడు తాజాగా మరో వార్త ప్రచారంలోకొచ్చింది. ఆ వార్త ప్రకారం అఖిల్ రెండో సినిమాని వంశీ డెరైక్ట్ చేయలేదట. మూడేళ్ల క్రితం హిందీలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘యే జవానీ హై దీవానీ’ని తెలుగులో అఖిల్ హీరోగా రీమేక్ చేయాలని నాగ్ అనుకుంటున్నారట. ఆ కథ మీదే వంశీని వర్కవుట్ చేయమని కోరారని భోగట్టా. కానీ, వంశీ అందుకు ఇష్టపడలేదట. వాస్తవానికి ‘ఊపిరి’ చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ ‘ఇన్‌టచబుల్స్’ ఆధారంగానే తీశారు. మళ్లీ వెంటనే మరో రీమేక్ చేయడానికి వంశీ అంత సుముఖంగా లేరట. అందుకే వేరే స్టోరీ లైన్‌తో చేద్దామని నాగ్‌తో అన్నారని తెలుస్తోంది. కానీ ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్‌ని వదిలేసి, కొత్త కథతో చేయడానికి నాగ్ సుముఖంగా లేరని కృష్ణానగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వేరే దర్శకుడితో అఖిల్ హీరోగా ‘యే జవానీ హై దీవానీ’ తెలుగు రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం తాను అనుకుంటున్న మంచి స్టోరీ లైన్‌తో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నారని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ గుసగుసల్లోని నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. -
అఖిల్ సరసన అలియా
అఖిల్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని వారసుడు. కొత్త కథతో ప్రయోగం చేసేకన్నా.. ఇప్పటికే ప్రూవ్ అయిన హిట్ సబ్జెక్ట్‌నే ఎంచుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడట. అంతేకాదు అప్పుడే మాస్ ఇమేజ్ కోసం పాకులాడే కన్నా.. తన లుక్, వయసుకు తగ్గట్టుగా లవ్ స్టోరితో ఆడియన్స్‌ను అలరించాలని భావిస్తున్నాడు. అందుకే ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. రణబీర్ కపూర్, దీపిక పదుకొణ్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఏ జవానీ హై దివానీ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. అంతేకాదు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ టాలీవుడ్లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేసుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్ అథినేత కరణ్ జోహార్‌తో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ లీడ్ రోల్లో ఫ్రెంచ్ మూవీ ఇంటచబుల్స్ను ఊపిరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు వంశీ. ఫ్రెంచ్ సినిమాను సౌత్ నేటివిటి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన వంశీపైడిపల్లి అయితే ఏ జవానీ హై దివానీని తెలుగు నేటివిటి తగ్గట్టుగా రూపొందిచగలడని భావిస్తున్నాడు నాగ్. ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ డాల్ అలియా భట్ హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. -
డబ్బు కాదు ... ప్రేమ, ప్రశంసలే ముఖ్యం
ముంబై : ప్రేమ, ప్రశంసలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె స్పష్టం చేశారు. ఆ రెండు తన జీవితంలో ముఖ్యమైనవే కాదు విలువైనవి కూడా అని ఆమె తెలిపారు. విజయానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వనిని ఆమె అన్నారు. డబ్బుకు అయితే చివరి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఆ ప్రశంసల కోసమే సినిమాలలో నటిస్తున్నానంటే పొరపాటు పడినట్లేనని దీపికా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు వెరైటీ పాత్రలతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న దీపికా పదుకొనె శుక్రవారం ముంబైలో విలేకర్లతో మాట్లాడారు. హీరోయిన్ కావడం అంత ఈజీ కాదని.... హీరోయిన్ కావడం కోసం తాను ఎంత కష్టపడింది ఆమె వివరించింది. తాను హీరోయిన్గా కంఫర్ట్ జోన్ చేరానని భావిస్తున్నానన్నారు. హృదయానికి హత్తుకునేలా ఉండే కథలలో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. అంతేకాని బాక్సాఫీసు వద్ద తాను నటించే సినిమా హిట్ అవుతుందా? లేక ఆ చిత్రం కోట్లాది రూపాయిల వ్యాపారం చేస్తుందా అని ఆలోచించనని తెలిపారు. దీపికా పదుకొనె తాజాగా నటించిన చిత్రం హ్యాపీ న్యూ ఇయర్. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ చిత్రం విడుదలపై అందరు దృష్టి సారించారు. ఓం శాంతి ఓం చిత్రంలో దీపికా నటనపనై విమర్శకులు విమర్శలు కురిపించారు. ఆ తర్వాత ఆమె నటించిన కాక్ టయిల్, యే జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్... చిత్రాలలో ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
పవన్ కళ్యాణ్ వైపు బాలీవుడ్ చూపు!
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర కలెక్షన్లు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను, విశ్లేషకులను దిమ్మతిరిగేలా చేశాయి. అత్తారింటికి దారేది చిత్రం బాలీవుడ్ చిత్రాలు రణబీర్ కపూర్ నటించిన 'యే జవానీ హై జిందగీ', షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాలకు ధీటుగా కలెక్షన్లను కురిపించింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో తాజాగా పవన్ కళ్యాణ్ హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత, ప్రణీత లతో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ చిత్రం సుమారు 16 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే పది రోజుల్లోనే 40 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ స్టామినాను అంచనా వేసిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ద్విభాషా చిత్రాల్లో నటింపచేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తొంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్, దక్షిణాది మార్కెట్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ కన్నేసిందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇటీవలే బాలీవుడ్ లో జంజీర్ చిత్రం ద్వారా రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి.. ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ పై పవన్ ఆసక్తిని ప్రదర్శిస్తాడా అనేది సందేహమే. దక్షిణాదిలో ఇప్పటికే ఓ రేంజ్ ను సొంతం చేసుకున్న పవన్.. హిందీ చిత్ర సీమలో ప్రవేశించడం ద్వారా తనకున్న క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే. -
నిజంగా.. నువ్వంత గొప్పదానివా?
ఒకప్పుడు బాలీవుడ్ తెరను యేలిన మాధురీ దీక్షిత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. డాక్టర్ శ్రీరామ్ నేనేతో పెళ్లి తర్వాత దశాబ్దం పాటు అమెరికాలో గడిపిన మాధురీ మళ్లీ మొహానికి రంగేసుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ పదేళ్లూ బాలీవుడ్‌కి దూరంగానే ఉన్నారామె. 2011లో ఇండియాకు తిరిగొచ్చాకనే సడన్ ఎంట్రీ ఇచ్చారు. మిగతా వాళ్లలా కాకుండా తన కెరీర్‌ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇటీవల ఆమె ‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ అబ్బుర పరిచారు. దాంతో ఆమె ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని రూఢీ అయ్యింది. ఓ పక్క గులాబ్ గ్యాంగ్, దేద్ ఇష్కియా తదితర చిత్రాల్లో నటిస్తూ, మరో పక్క దర్శకుడు కరణ్‌జోహార్, నృత్య దర్శకుడు రెమోతో కలిసి కలర్స్ టీవీ ఛానల్లో ‘ఝలక్ దిక్లాజా’ అనే డాన్స్ రియాల్టీషోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇంత బిజీ అయ్యి, మళ్లీ స్టార్‌డమ్‌ని తెచ్చుకున్నా కూడా మాధురీ ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం మిస్ కావడం లేదు. తన ఇద్దరు పిల్లలు ఆరిన్, రాయన్లకు మునుపటిలాగానే టైమ్ కేటాయిస్తున్నారట. ఆ విధంగా తన షూటింగ్స్ని డిజైన్ చేసుకుంటున్నారామె. బుల్లితెరపై తల్లిని చూసి ఆ పిల్లలు కూడా తెగ సంబరపడి పో తున్నారట. ‘‘మమ్మీ నువ్వు టీవీలో కనిపించినప్పుడు అందరూ నీ గురించి గొప్పగా చెబుతున్నారు. నిజంగా... నువ్వంత గొప్పదానివా?’’ అంటూ తల్లిని ముద్దుల వర్షంలో ముంచెత్తేస్తున్నారట. -
కత్రినా ‘బికినీ’ వ్యవహారంపై దీపికా స్పందన!
తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్పెయిన్‌లో ప్రైవేట్ విహారయాత్ర చేసిన సందర్భంగా బికినీ దుస్తుల్లో బాలీవుడ్ తార కత్రినాకైఫ్ కెమెరాకు చిక్కిన ఫోటోలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ మీడియాకు లేఖ రాసి వివరణ ఇచ్చుకోవడంతో ఆ దుమారం సద్దుమణిగింది. అయితే కత్రినా వ్యవహారంపై దీపికా పదుకొనే స్పందిస్తూ ‘నేను ఇప్పటి వరకు అలా ఎవరికంటా పడలేదు’ అని తెలిపింది. సెలబ్రీటిలకు, సమాజంలో ప్రముఖ వ్యక్తులకు అలాంటి సంఘటనలు ఎదురవ్వడం సహజమే అని ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో అఫైర్ నడుపుతున్న దీపికా అన్నారు. అందుకు మరొకరిని నిందించడం, ఆరోపణలు చేయడంలో ప్రయోజనం శూన్యం వెల్లడించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు తనకు ఎదురైతే.. కాస్తా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాను అని చెప్పింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత షారుక్‌తో, యే జవానీ హై దివానీ చిత్రం తర్వాత రణబీర్ కపూర్‌తో జోడి క డుతున్నారని వచ్చిన వార్తలు నిజమేనా అనే ప్రశ్నకు జవాబు దాటవేస్తూ.. ప్రతి చిత్రానికి ఓ గమ్యం ఉంటుందని.. తాను చిత్రాలను ఎంపిక చేసుకోను. సినిమాలోని పాత్రలే తనను వెదుకుంటూ వస్తాయని.. నటించడం అలా అలా జరిగిపోతుంటాయని దీపికా వేదాంతం ఒలకబోసింది. షారుఖ్ తో హ్యప్పీ న్యూ ఇయర్ అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు బాలీవుడ్ సమాచారం.