నిజంగా.. నువ్వంత గొప్పదానివా?
నిజంగా.. నువ్వంత గొప్పదానివా?
Published Sat, Aug 10 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఒకప్పుడు బాలీవుడ్ తెరను యేలిన మాధురీ దీక్షిత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. డాక్టర్ శ్రీరామ్ నేనేతో పెళ్లి తర్వాత దశాబ్దం పాటు అమెరికాలో గడిపిన మాధురీ మళ్లీ మొహానికి రంగేసుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ పదేళ్లూ బాలీవుడ్‌కి దూరంగానే ఉన్నారామె. 2011లో ఇండియాకు తిరిగొచ్చాకనే సడన్ ఎంట్రీ ఇచ్చారు.
మిగతా వాళ్లలా కాకుండా తన కెరీర్‌ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇటీవల ఆమె ‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ అబ్బుర పరిచారు. దాంతో ఆమె ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని రూఢీ అయ్యింది. ఓ పక్క గులాబ్ గ్యాంగ్, దేద్ ఇష్కియా తదితర చిత్రాల్లో నటిస్తూ, మరో పక్క దర్శకుడు కరణ్‌జోహార్, నృత్య దర్శకుడు రెమోతో కలిసి కలర్స్ టీవీ ఛానల్‌లో ‘ఝలక్ దిక్లాజా’ అనే డాన్స్ రియాల్టీషోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇంత బిజీ అయ్యి, మళ్లీ స్టార్‌డమ్‌ని తెచ్చుకున్నా కూడా మాధురీ ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం మిస్ కావడం లేదు. తన ఇద్దరు పిల్లలు ఆరిన్, రాయన్‌లకు మునుపటిలాగానే టైమ్ కేటాయిస్తున్నారట. ఆ విధంగా తన షూటింగ్స్‌ని డిజైన్ చేసుకుంటున్నారామె. బుల్లితెరపై తల్లిని చూసి ఆ పిల్లలు కూడా తెగ సంబరపడి పో తున్నారట. ‘‘మమ్మీ నువ్వు టీవీలో కనిపించినప్పుడు అందరూ నీ గురించి గొప్పగా చెబుతున్నారు. నిజంగా... నువ్వంత గొప్పదానివా?’’ అంటూ తల్లిని ముద్దుల వర్షంలో ముంచెత్తేస్తున్నారట.
Advertisement
Advertisement