అఖిల్ సరసన అలియా | Akhil next movie yeh jawaani hai deewani remake | Sakshi
Sakshi News home page

అఖిల్ సరసన అలియా

Published Sat, Jan 9 2016 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

అఖిల్ సరసన అలియా

అఖిల్ సరసన అలియా

అఖిల్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని వారసుడు. కొత్త కథతో ప్రయోగం చేసేకన్నా.. ఇప్పటికే ప్రూవ్ అయిన హిట్ సబ్జెక్ట్నే ఎంచుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడట. అంతేకాదు అప్పుడే మాస్ ఇమేజ్ కోసం పాకులాడే కన్నా.. తన లుక్, వయసుకు తగ్గట్టుగా లవ్ స్టోరితో ఆడియన్స్ను అలరించాలని భావిస్తున్నాడు. అందుకే ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

రణబీర్ కపూర్, దీపిక పదుకొణ్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఏ జవానీ హై దివానీ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. అంతేకాదు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ టాలీవుడ్లో అడుగుపెట్టడానికి ప్లాన్ చేసుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్ అథినేత కరణ్ జోహార్తో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ లీడ్ రోల్లో ఫ్రెంచ్ మూవీ ఇంటచబుల్స్ను  ఊపిరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు వంశీ. ఫ్రెంచ్ సినిమాను సౌత్ నేటివిటి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసిన వంశీపైడిపల్లి అయితే ఏ జవానీ హై దివానీని తెలుగు నేటివిటి తగ్గట్టుగా రూపొందిచగలడని భావిస్తున్నాడు నాగ్. ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ డాల్ అలియా భట్ హీరోయిన్గా నటించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement