200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' | 'Chennai Express' earns Rs. 200.56 crore | Sakshi
Sakshi News home page

200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'

Aug 23 2013 6:42 PM | Updated on Sep 1 2017 10:03 PM

200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'

200 కోట్ల మార్కును దాటిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండవ వారం పూర్తయ్యే సరికి చెన్నై ఎక్స్ ప్రెస్ 200 కోట్ల మార్కును దాటేసింది. మూడవ వారంలో కూడా కలెక్షన్లు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.  రోహిత్ శెట్టి దర్శకత్వంలో 75 కోట్ల వ్యయంతో యాక్షన్, కామెడి  చిత్రంగా రూపొందింది. విదేశాల్లో కూడా ఈ చిత్ర కలెక్షన్లు భారీగానే ఉన్నయని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. 
 
తొలివారంలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు ఇంత భారీ వసూళ్లు ఏ సినిమాకీ లేవు. అది అద్భుతమైన వారాంతమని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పారు.

రంజాన్ సందర్భంగా ఆగస్టు తొమ్మిదో తేదీ శుక్రవారం నాడు విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్లు సంపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement