
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప.
'చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్‌గా షారుక్ ఖాన్‌పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు.
కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment