అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె | Not spoofing South India in 'Chennai Express': Deepika Padukone | Sakshi
Sakshi News home page

అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె

Published Mon, Aug 5 2013 9:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె

అలా ఎందుకు ఫిక్స్ అవుతారో - దీపికా పదుకోనె

ఎందుకు జనం అంత తొందరగా ఓ నిర్ణయానికి ఫిక్స్ అవుతారో నాకు అర్ధం కావడం లేదు అని అంటోంది దక్షిణాదికి చెందిన బాలీవుడ్ తార దీపికా పదుకోనె. మన సంస్కృతిని మనం ఎందుకు కించ పరుచుకుంటాం. నేను, దర్శకుడు రోహిత్ శెట్టి దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్లమే. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో షారుక్ ఖాన్ తప్ప మిగితా నటులంతా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందినవారేనని స్పష్టం చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో తమిళ భాషను కించపరిచేలా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలను దీపిక ఖండించింది.

గతంలో పంజాబ్ ఆధారంగా చేసుకుని చిత్రాలు రూపొందాయని.. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమపైనే ఆధారపడి చిత్రాలు నిర్మిస్తున్న తరుణంలో తాము దక్షిణాది భాషను కించపరుస్తామని ఎలా భావిస్తారన్నారు. తమిళ భాషను హాస్యం కోసమే వాడుకున్నామని.. ఆ భాషను అపహాస్యం చేసే విధంగా ఎక్కడ ప్రయత్నించలేదని దీపిక తెలిపింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ఉత్తర భారతీయుడ్ని ప్రేమించిన తమిళ అమ్మాయిగా దీపిక పదుకోనె నటిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement