పాక్లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్ప్రెస్' | 'Chennai Express' a big hit in Karachi | Sakshi
Sakshi News home page

పాక్లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్ప్రెస్'

Published Thu, Aug 15 2013 11:50 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

పాక్లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్ప్రెస్'

పాక్లో దూసుకెళ్తున్న 'చెన్నై ఎక్స్ప్రెస్'

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా పాకిస్థాన్లో విడుదలై విజయఢంకా మోగిస్తుందని స్థానిక పత్రిక డాన్ గురువారం వెల్లడించింది. ఇద్ పండగ సందర్భంగా విడుదలైన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని పేర్కొంది. చెన్నై ఎక్స్ప్రెస్ విడుదలైన మొదటి రోజు మొదటి సినిమాకే పాక్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని తెలిపింది. బాక్స్ ఆఫిస్ వద్ద ఆ కనకవర్షం కరుస్తుందని విశ్లేషకులు అంచనాలను నిలబెట్టిందని చెప్పింది.

 

రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈద్ పండగ రోజును విడుదలైంది. అయితే అదే రోజున విడుదలైన ఇష్క్ కుదా సినిమా ప్రజలను అంతగా ఆకట్టుకోలేదని కాప్రి సినిమా జనరల్ మేనేజర్ అజీజ్ ఖాన్ తెలిపారని డాన్ పేర్కొంది. అలాగే దేశంలో ఇటీవల విడుదలైన ఇతర చిత్రాలను కూడా వెనక్కి నెట్టి 'చెన్నై ఎక్స్ప్రెస్' పాక్లో దూసుకెళ్తుందని డాన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement