మేమంతా నీతోనే: సచిన్ | We are with you, Tendulkar tells Rio-bound Shiva Thapa | Sakshi
Sakshi News home page

మేమంతా నీతోనే: సచిన్

Published Fri, Apr 8 2016 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

మేమంతా నీతోనే: సచిన్

మేమంతా నీతోనే: సచిన్

న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో రజత పతకం సాధించి రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత బాక్సర్ శివ థాపాకు మాస్టర్ బ్టాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి  మద్దతు లభించింది. 'రియోకు అర్హత సాధించిన నీకు అంతా మంచే జరగాలి. మేమంతా నీతోనే ఉన్నాం. మా నుంచి నీకు పూర్తి సహకారం ఉంటుంది. రియో పోరులో ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. లక్ష్యంపైనే గురి పెట్టు. ఫలితం అదే వస్తుంది' అని టెండూల్కర్ ట్వీట్ చేశాడు.



బరిలో దిగేటప్పుడు సానుకూల దృక్పథంతో ఉండాలని సచిన్ సూచించాడు. ఒక బిగ్ ఈవెంట్ లో పాల్గొంటున్నప్పుడు ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందని, దాన్ని అధిగమించడానికి కృషి చేయమని శివ థాపాకు విజ్ఞప్తి చేశాడు. టీమిండియా వన్డే వరల్డ్ కప్ ను గెలిచినప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించారంటూ థాపా ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు సచిన్ పై విధంగా బదులిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement