'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది' | Ganguly's application for opening position under process: Tendulkar | Sakshi
Sakshi News home page

'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'

Published Wed, Nov 4 2015 5:00 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది' - Sakshi

'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'

నవంబర్ 9న అమెరికాలోని న్యూయార్క్లో జరుగనున్న ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నమెంట్లో తనకు ఓపెనర్గా అవకాశం ఇవ్వాలని, లేకుంటే వెంటనే కోల్కతా విమానం ఎక్కుతానని సరదాగా అన్న గంగూలీ వ్యాఖ్యలకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బదులిచ్చారు. ఓపెనర్ స్థానానికి గంగూలీ అప్లికేషన్ పరిశీలనలో ఉందని, అలాగే అతని బ్యాట్ నుంచి చక్కటి ఆఫ్ డ్రైవ్ని ఆశిస్తున్నానని సచిన్ ట్వట్టర్ ద్వారా తెలిపారు.

ఆస్ట్రేలియా లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ నేతృత్వం వహిస్తున్న 'వార్న్ వారియర్స్' జట్టుతో సచిన్ బ్లాస్టర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసేందుకు గంగూలీ చాలా కాలం తరువాత మంగళవారం నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement