సూపర్‌మ్యాన్‌లా భావిస్తారు! | Considered as Superman! | Sakshi
Sakshi News home page

సూపర్‌మ్యాన్‌లా భావిస్తారు!

Published Tue, Nov 22 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

సూపర్‌మ్యాన్‌లా   భావిస్తారు!

సూపర్‌మ్యాన్‌లా భావిస్తారు!

అభిమానాన్ని అదుపు చేయడం కష్టం 
నాలుగు ఐస్ ముక్కలు చాలని సచిన్‌తో చెప్పా
విరాట్ కోహ్లి చెప్పిన విశేషాలు

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు రారాజులా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లి... ఫార్మాట్ ఏదైనా అతని తిరుగులేని ప్రదర్శనకు ఆటగాళ్లు, విశ్లేషకులు అంతా దాసోహం అంటున్నారు. ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలాటి కోహ్లి భారత అభిమానుల దృష్టిలో మరో సచిన్ టెండూల్కర్. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో అతని ఆటకు అన్ని రికార్డులు ముంగిట వచ్చి వాలిపోతున్నారుు. పోలికలో ఒక రకంగా సచిన్‌ను కూడా అతను మించిపోతున్నాడు. భారత టెస్టు కెప్టెన్‌గా విశాఖపట్నంలో మరో అద్భుత విజయం సాధించిన అనంతరం కోహ్లి తన గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విశేషాలు...

 సెంచరీలే ఆశిస్తారు
బౌండరీ వద్ద నిలబడినప్పుడు ప్రేక్షకులు పదే పదే నేను సెంచరీ కొట్టాలని కోరుతూ ఉంటారు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెడితే వారి అభిమానాన్ని తప్పు పట్టలేం. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ ఇది వారు కురిపిస్తున్న ప్రేమని మెల్లగా అర్థమైంది. భారత క్రికెటర్‌కు ఇదంతా సహజం. దానినుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అది ఇంకా వెంటాడుతుంది. మరింతగా ఒత్తిడి పెంచి మనల్ని కింద పడేస్తుంది.

కొన్నేళ్లు పోతే మర్చిపోతారు
నేను బాగా ఆడుతున్నానని, అన్ని రికార్డులు బద్దలు కొడతానని అంతా చెబుతుంటారు. అరుుతే నేను వాస్తవానికి దగ్గరగా బతుకుతాను. ఒక 10-12 ఏళ్లు ముందుకు వెళితే నేను మీకు కనిపించను. ఆ స్థానంలో మరొకరు వస్తారు. ఇప్పుడు చూపిస్తున్న ఆదరాభిమానాలు, కీర్తి అతనికి దక్కుతారుు. కాబట్టి ప్రస్తుతంకంటే నేను భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తా. జట్టులోని మిగతా 10 మందికంటే నేనేమీ గొప్ప కాదని భావిస్తాను.

చేతులు పట్టుకొని చూశాడు
టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. ఎరుుర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి నాకు చేరువగా వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోతే నేను వారించాను. అతను నా చేరుు చూపించమని అడిగాడు. పట్టుకొని ఏదో ఒంట్లో కరెంట్ వచ్చినట్లుగా కదిలిపోయాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఏంటిది అని తిట్టుకున్నాను. అతను నన్నేదో సూపర్‌మ్యాన్‌లా భావించాడు. చాలా మంది మమ్మల్ని పట్టుకొని మనిషా కాదా అన్నట్లుగా చూసి చెక్ చేసుకుంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

ఆ మాటలు మార్చేశారుు
ప్రొఫెషనల్ క్రీడలలో ప్రొఫెషనలిజం కనిపించనిది ఒక్క క్రికెట్‌లోనే. టెన్నిస్ ఆటగాళ్లలాంటి ఫిట్‌నెస్ మనకేదీ అని అప్పటి కోచ్ ఫ్లెచర్ ఒక రకంగా వ్యంగ్యంగా అన్నారు. దాంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణరుుంచుకున్నా. అప్పట్లో ఏది పడితే అది తినేవాడిని. ఎక్కువసేపు మెలకువగా ఉండటంతో పాటు రెగ్యులర్‌గా మద్యం తాగేవాడిని కూడా. తర్వాత అన్నీ మానేసి కఠినంగా కసరత్తులు చేశాను. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని. అరుుతే మంచి ఫలితాలు వచ్చాక అదే డైట్‌ను కొనసాగించాను. శ్రీలంకలో ఒకసారి ఫీల్డింగ్ సందర్భంగా నా ఫిట్‌నెస్ స్థారుు చూసి నేనే ఆశ్చర్యపోయా.

క్రికెట్టే నన్ను ఎంచుకుంది
నాకు గుర్తున్నంత వరకు క్రికెట్ బ్యాట్‌తోనే నా బాల్యం గడిచిపోరుుంది. ఇంట్లో అందరికంటే చిన్నవాడిని కావడంతో బాగా చదవాలని, సంపాదించాలనే ఒత్తిడి నాపై ఎప్పుడూ లేదు. నన్ను అందరూ గారాబం చేయడాన్ని కూడా బాగా వాడుకున్నాను! ఆరేళ్ల వయసులో క్రికెట్‌కు ఉన్న విలువేమిటో అర్థమైంది. సచిన్ గురించి తెలిసింది కూడా అప్పుడే. 12 ఏళ్ల వయసులో తొలిసారి చూశాను. చాలా మందిలాగే ఆయనే స్ఫూర్తిగా ఆట వైపు మరలాను.

డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారి...
చాలా ఏళ్ల తర్వాత సచిన్‌తో కలిసి ఆడే అవకాశం వచ్చింది. సహజంగానే సీనియర్ల ముందు మన ఇష్టాఇష్టాలు, పార్టీల గురించి చెప్పలేకపోవడం భారతీయుల్లో సహజం. నాకు డ్రింక్ అంటే ఇష్టమని సచిన్‌తో చెప్పగలగడమే నాకు ఎదురైన పెద్ద సవాల్! ఆయన డ్రింక్ తీసుకోమని అడిగారు. నాకు అలవాటు లేదన్నాను. మళ్లీ అడిగితే మళ్లీ అదే జవాబిచ్చాను.చివరకు నాకు నాలుగు ఐస్ క్యూబ్‌లు చాలని చెప్పగలిగాను. ఆ తర్వాత అది చాలా సాధారణంగా మారిపోరుుంది. అరుుతే ఇప్పుడు ఐపీఎల్ వల్ల అందరం తొందరగా కలిసిపోగలుగుతున్నాం. జోక్స్ చెప్పుకోవడం, సెల్ఫీలు కామన్‌గా మారిపోయారుు.

ఇంకా మారాల్సి ఉంది
మైదానంలో నా ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటాను. కొన్నిసార్లు పరిస్థితులు చేజారిపోరుునప్పుడు అసహనం పెరిగిపోవడమే దానికి కారణం. దీన్ని ఇంకా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అర్ధ సెంచరీలు, సెంచరీలు సాధించినప్పుడు సంబరాలు జరుపుకోవడం కూడా తగ్గించేశాను. నా పనే పరుగులు చేయడం అరుునప్పుడు అంత ఉద్వే గం ప్రదర్శించడం అవసరమా అనిపించడమే అందుకు కారణం.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement