
సచిన్ తో డిన్నర్ చేయాలనుందా?
వీలైతే ఓ ఆటోగ్రాఫ్.. కుదిరితే ఫొటోగ్రాఫ్.. క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్ తో అంతకుమించిన సమయం గడపడం సాధ్యమవుతుందా..?
వీలైతే ఓ ఆటోగ్రాఫ్.. కుదిరితే ఫొటోగ్రాఫ్.. క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్ తో అంతకుమించిన సమయం గడపడం సాధ్యమవుతుందా..? సచిన్తో మాట్లాడే అవకాశం రావడమే అరుదు.. అలాంటిది ఏకంగా మాస్టర్తో కలసి డిన్నర్ చేసే అవకాశం వచ్చింది. అభిమానుల కోసం ఓ బంపర్ ఆఫర్!
వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 22న) సిడ్నీలోని ఓ ప్రఖ్యాత రెస్టారెంట్లో దాదాపు 60 మందితో కలసి సచిన్ డిన్నర్ చేయనున్నారు. ఈ 60 మందిలో మీరూ ఒకరు కావాలనుకుంటే దాదాపు 70 వేల రూపాయల నుంచి 1.40 లక్షల వరకు చెల్లించాలి. ఈ విందు ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని సచిన్ పేరుతో నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థకు అందించనున్నారు. ఒకవేళ 22న మిస్ అయినా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత మెల్బోర్న్లోనూ ఇలాంటి విందే మరోటి జరుగనుంది.ఇటు సచిన్తో కలసి భోజనం చేశామన్న సంతోషం.. అటు సామాజిక సేవకు సాయపడ్డామన్న తృప్తి కావాలంటే.. గెట్ రెడీ టు డైన్ విత్ లిటిల్ మాస్టర్.