'వీళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కారు' | Current Indian batsmen are not Sachins and Dravids, don't compare: Angelo Mathews | Sakshi
Sakshi News home page

'వీళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కారు'

Published Wed, Aug 19 2015 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

'వీళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కారు'

'వీళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కారు'

కొలంబో: ప్రస్తుత టీమిండియా బ్యాట్స్మెన్.. సచిన్, ద్రావిడ్లు కారని, స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఈ దిగ్గజాలతో పోల్చరాదని శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ అన్నాడు. సచిన్, ద్రావిడ్ల మాదిరిగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో ఆడలేరని మాథ్యూస్ చెప్పాడు.

తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యసాధనలో టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్కు తడబడి 63 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ ముందు రోజు బుధవారం మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్లో ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. భారత జట్టులో ఏ క్రికెటర్నూ సచిన్, ద్రావిడ్లతో పోల్చరాదని చెప్పాడు. భారత యువ బ్యాట్స్మెన్ను సచిన్, ద్రావిడ్లతో ఎలా పోల్చరాదో.. తమ జట్టులోని యువ ఆటగాళ్లను మహేల జయవర్ధనె, సంగక్కరలతో పోల్చరాదని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement