ముల్తాన్..సుల్తాన్.. సెహ్వాగ్
ముల్తాన్..సుల్తాన్.. సెహ్వాగ్
Published Wed, Mar 29 2017 6:10 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
న్యూఢిల్లీ: సరిగ్గా ఇదే రోజు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచింది. అదే త్రిశతక వీరుడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర రూపం చూపించన రోజు. మార్చి 29, 2004 ప్రపంచ టెస్టు క్రికెట్లోనే అత్యంత వేగమైన త్రిబుల్ సెంచరీ నమోదయింది. ఈ ఘనత వీరు మన దాయాదీ పాకిస్థాన్‌పై సాధించడంతో భారత అభిమానులకు పండుగ దినమైంది. ఈ ఘనత సాధించి నేటికి 13 సంవత్సరాలు. దీన్ని గుర్తు చేసుకుంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెహ్వాగ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ముల్తాన్ టెస్టు రెండో రోజు ఆటలో త్రిశతకం సాధించి భారత్ తరపున తొలి త్రిబుల్ సెంచరీ సాధించన క్రికెటర్‌గా సెహా్వగ్ రికార్డు నమోదు చేశాడు.
త్రిబుల్ సెంచరీని వీరు సిక్సర్‌తో సాధించడం కొసమెరుపు. అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డును వీరు అధగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ 39 బౌండరీలు, ఆరు సిక్సర్లతో దాయదులకు చుక్కలు చూపించాడు. వీరు 82.40 స్ట్రైక్‌రేట్‌తో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. వీరు మెరుపు బ్యాటింగ్‌తో భారత్ రెండేరోజుల్లో650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లెర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని తెలిపాడు.
Advertisement
Advertisement